Site icon HashtagU Telugu

TSRTC బస్సుల్లో మగవారికి మంచి రోజులు వచ్చాయి..

Tsrtc Separate Buses For Me

Tsrtc Separate Buses For Me

TSRTC బస్సుల్లో మగవారికి మంచిరోజులు వచ్చాయి..ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా సీట్లలో కూర్చునే అవకాశం వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా..? తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు TSRTC లో ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం (Maha Lakshmi Scheme) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ (Palle Velugu and Express Buses)బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించారు. తెలంగాణ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్‌ తీసుకుని ఉచిత ప్రయాణ చేయొచ్చని తెలుపడం తో ఆర్టీసీ బస్సుల్లో ఎన్నడూ లేనంతగా రద్దీ పెరిగింది. గతంలో రోజుకు 12-14 లక్షల మంది మహిళా ప్రయాణికులు రాగా, ప్రస్తుతం వారి సంఖ్య 30 లక్షలకుపైగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో మగవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూర్చునేందుకు వీలు లేకుండా మహిళలు పోటీపడి బస్సు ఎక్కుతున్నారని..దీంతో గంటల కొద్దీ నిల్చుని ప్రయాణం చేయాల్సి వస్తుందని, ఫ్రీ గా బస్సు ప్రయాణం చేసే వారు దర్జాగా కూర్చుని వెళ్తుంటే..డబ్బులు పెట్టి మీము నిల్చుని ప్రయాణం చేయాల్సి వస్తుందని..సీఎం రేవంత్ ..మగవారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటైన చెయ్యండి..లేదంట మగవారికి ప్రత్యేక సీట్లు కేటాయించడమైన చేయాలనీ కోరుతూ వస్తున్నారు.

ఈ క్రమంలో TSRTC మగవారికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే కసరత్తులు మొదలుపెట్టింది. ‘పురుషులు మాత్రమే’ అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నగరంలో దర్శనమిచ్చింది. ఇది చూసిన మగవారు.. మనకు కూడా స్వాతంత్య్రం వచ్చిందని సంతోష పడుతున్నారు. రుషులకు కూడా సీట్లు దొరికి కూర్చునే రోజులు వచ్చేశాయంటూ.. లేచింది పురుష ప్రపంచం అంటూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Adimulam Koneti : ఆఫర్లు ఇచ్చినా ఆదిమూలం ఆగనంటుండే..!