Site icon HashtagU Telugu

Sankranthi Buses:సంక్రాంతి స్పెషల్ బస్సులకు ‘‘నో ఎక్స్ ట్రా ఛార్జెస్’’!

TSRTC

TSRTC

సంక్రాంత్రి పండుగ కోసం తమ సొంత ఊర్లకి వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు నడపడానికి 4,318 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఆర్టీసీ తెలిపింది.

హైదరాబాద్‌ మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ లతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో బస్ పాయింట్లను ఏర్పాటు చేశారు. సీబీఎస్, ఉప్పల్, దిల్ షుక్ నగర్, ఎల్బీ నగర్ , లింగంపల్లి, చందానగర్, ఎస్ ఆర్ నగర్, ఈసీఐఎల్, కేపీహెచ్బీ, అమీర్పెట్ లలో ప్రత్యేక బస్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో నివసించే వారికి సమీపంలో స్పెషల్ బస్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.

స్పెషల్ బస్సులను మానిటరింగ్ చేయడానికి 200 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు అధికారులు తెలిపారు.

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, www.tsrtconline.in వెబ్‌సైట్‌లో రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

Exit mobile version