Site icon HashtagU Telugu

TSRTC : రేవంత్ సర్కార్ కు షాక్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు

Tsrtc Rental Bus Owners Pla

Tsrtc Rental Bus Owners Pla

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Govt) టీఎస్ఆర్టీసీ (TSRTC) అద్దె బస్సుల యజమానులు (TSRTC Rental Bus Owners) షాక్ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణ అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus Scheme) కల్పించారు. ఈ పథకం వచ్చిన దగ్గరి నుండి బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ పెరగడం తో తమ బస్సులు పాడవుతున్నాయని, రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని ప్రవైట్ బస్సు యజమానులు వాపోతూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఈ నెల 5 నుంచి సమ్మెలోకి దిగుతామని హెచ్చరించారు. అద్దె బస్సు యజమానుల నిర్ణయంతో మహిళలకు ఉచిత బస్సు జర్నీ స్కీం విషయంలో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీరు మాత్రమే కాదు ఆటో డ్రైవర్స్ సైతం ఫ్రీ బస్సు పథకం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని..కనీసం కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికే పలు నిరసనలు , ఆందోళనలు చేపట్టారు. ఎల్లుండి ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నాకు పిలుపునిచ్చారు. మరి అద్దె బస్సుల యాజమాన్యాలతో ప్రభుత్వం ఏమైనా చర్చలు జరుపుతుందా అనేది చూడాలి.

Read Also : AP : ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ-జనసేన పార్టీల సరికొత్త లోగో