Site icon HashtagU Telugu

TSRTC : ప్ర‌యాణికుల‌కు షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ.. ఆ టికెట్లను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం

Tsrtc

Tsrtc

ప్ర‌యాణికుల‌కు టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల‌ జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. సోమవారం(జనవరి 1, 2024) నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జానర్ ప్రకటించారు.

Also Read:  YSRCP : ప్లీజ్ ఒక్క‌సారి సీఎం అపాయిట్‌మెంట్ ఇప్పించండి.. వైసీపీలో జిల్లా అధ్య‌క్షుడు ఆవేద‌న‌