అల్లు అర్జున్‌కి టీఎస్ఆర్టీసీ లీగ‌ల్ నోటీస్‌…కార‌ణం ఇదే…?

ప్రభుత్వ బస్సుల‌పై చాలా మంది సైటైర్స్ వేస్తుంటారు.సాధార‌ణ ప్ర‌జ‌లు బ‌స్సు ఆల‌స్యంగా వ‌స్తేనో సీటు దొర‌క్కో కాస్త చిరాకులో ప‌డి సైటెర్స్ వేస్తారు.

  • Written By:
  • Publish Date - November 10, 2021 / 10:54 AM IST

ప్రభుత్వ బస్సుల‌పై చాలా మంది సైటైర్స్ వేస్తుంటారు.సాధార‌ణ ప్ర‌జ‌లు బ‌స్సు ఆల‌స్యంగా వ‌స్తేనో సీటు దొర‌క్కో కాస్త చిరాకులో ప‌డి సైటెర్స్ వేస్తారు. వీరు ప్ర‌యాణికులు కాబట్టి వేస్తే ప‌ర్వాలేదు కానీ ఓ హోదాలో ఉండి సైటెర్స్ వేస్తే అది స‌మాజంలో చెడుగా వెళ్తుంది.ఇలాంటి ఘ‌ట‌న ఇప్పుడు ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. టాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకున్నారు. ర్యాపిడో సంస్థ‌కు సంబంధించి ఓ యాడ్ లో టీఎస్ఆర్టీసీ బ‌స్సులను చిన్న‌చూపు చూస్తూ వాటికంటే ర్యాపిడో బెట‌ర్ అనే విధంగా యాడ్ చేయ‌డంతో ఇప్పుడు వివాద‌మైంది. బైక్ టాక్సీ యాప్ రాపిడో కోసం అల్లు అర్జున్ చేసిన ప్రకటన, ఇందులో రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సును చూపిస్తూ, ఆర్టీసీ బస్సులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని దీనికి బదులుగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ర్యాపిడోను ఎంచుకోవాలని యువకుడికి చెప్పడం కనిపించింది.

Also Read : పక్కా స్కెచ్ తోనే కేసీఆర్ ప్రెస్ మీట్స్

దీనికి తోడు ఆర్టీసీ బ‌స్సులో మాములూ దోశలా ఎక్కితే దిగే స‌రికి కుర్మా వేసి కైమా కొట్టిన మ‌సాలా దోశ లా ఉంటార‌ని చెప్పాడు. దీంతో టీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఈ యాడ్ ఆర్టీసీ బ‌స్సుల‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. టిఎస్‌ఆర్‌టిసిని కించపరచడం యాజమాన్యం కూడా సహించదని సజ్జనార్ అన్నారు. మెరుగైన సమాజం మరియు స్వచ్ఛమైన వాతావరణం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో నటీనటులు నటించాలని పేర్కొన్న సజ్జనార్, TSRTC నటుడికి మరియు ప్రకటనను ప్రచారం చేసే సంస్థకు లీగల్ నోటీసు పంపుతుందని చెప్పారు. బస్సులు, బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేస్తున్న వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.సెల‌బ్రిటీలు ప్ర‌జారవాణా,ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌కు హాని క‌లిగించే కంటెంట్ ని ప్ర‌చారం చేయ‌కుండా ఉండాల‌ని స‌జ్జ‌నార్ కోరారు.