TSRTC JAC : ఆర్టీసీ విలీనంపై అనుమానాలు ఉన్నాయి..ఆర్టీసీ JAC నాయకుల సమావేశం..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం అని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై నేడు ఆర్టీసీ JAC(TSRTC JAC) నాయకుల సమావేశం జరిగింది.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 08:29 PM IST

నిన్న సీఎం కేసీఆర్(CM KCR) అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting) జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం అని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజా రవాణాని పటిష్టం చేసేందుకు ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని, దీనికి సంబంధించిన బిల్లుని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని, ఈ నిర్ణయంతో దాదాపు 43 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారని KTR తెలిపారు.

ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా దీనికోసమే ఎదురు చూశారు. గతంలో విలీనం కోసం సమ్మె కూడా చేశారు. దీనికి కావాల్సిన విధి విధానాలకు సంబంధిన కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభా వ్యవహారాలశాఖ, ఆర్థిక శాఖ మంత్రులకు, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే ఈ నిర్ణయంపై నేడు ఆర్టీసీ JAC(TSRTC JAC) నాయకుల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ JAC చైర్మన్ అశ్వద్దామ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర క్యాబినెట్ లో ప్రభుత్వంలో ఆర్టీసి విలీన ప్రకటనను జేఏసి స్వాగతిస్తున్నాం. ఆర్టీసి సమ్మె కూడా విలీనం కోసమే జరిగింది. విలీననానికి వెంటనే కమిటీ వేయాలి. సమ్మె సమయంలో 34 మంది మరణించారు. ఈ విజయం ఆర్టీసి అమరులకు అంకితం చేస్తుంది. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా త్వరగా పూర్తి చేయాలి. అలాగే 2017,21 వేతన సవరణ కూడా చేయాలి. కమిటీ కార్మికుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. నెలలోపే విలీనం పూర్తి చేయాలి. కమిటీలపై కార్మికులకు అనుమానాలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలి అని అన్నారు.

ఆర్టీసి జేఏసి కన్వీనర్ హన్మంతు ముదిరాజ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో బిల్ పెట్టి విలీనం చేస్తామని సీఎం చెప్పడన్ని స్వాగతిస్తున్నాం. ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. విలీనంపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలి. విలీనం కోసం చేసిన సమ్మె లో ఎంతమంది మరణించారు. మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేసి, Ccs నిధులు చెల్లించాలి. విధివిధానాలు ప్రకటించి నెలలోపు విలీన ప్రక్రియ పూర్తి చేయాలి అని అన్నారు.

 

Also Read : Telangana High Court : అయోమయంలో 26 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?