Separate Seats for Men : బస్సులో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించే ఆలోచనలో TSRTC ..?

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 07:43 PM IST

స్త్రీలను (Women) గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం..ఇది మొన్నటి వరకు..కానీ ఇక ఇప్పుడు పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం..ఇది అతి త్వరలో TSRTC లో కనిపించబోయే స్లోగన్‌ లా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ (Congress Govt) ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించి వారిని సంతోష పెడదామని చూస్తే..అరే ఎందుకు పెట్టారా ఈ స్కిం అని మాట్లాడుకునేలా చేస్తున్నారు మహిళలు. ఫ్రీ బస్సు సౌకర్యం లేనప్పుడు ఏ ఫంక్షన్ కైనా..ఇంటి నుండి ఒక్కరు మాత్రమే వెళ్లేవారు..అది కూడా మగవారే..కానీ ఇప్పుడు ఫ్రీ అని ఏ పెద్ద ఫంక్షన్ కైనా..చిన్న ఫంక్షన్ కైన్..ఆఖరికి పక్కంటివిడ చీరలు కొనేందుకు వెళ్తుంటే కూడా ఆ కాలనీ ఆడవారు వెళ్తున్నారంటే అర్ధం చేసుకోవాలని ఫ్రీ పథకాన్ని ఎంత ఫ్రీ గా వాడుకుంటున్నారో..

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఫ్రీ సౌకర్యం పెట్టిన దగ్గరి నుండి మగవారికి (Men) అసలు బస్సులో సీటు అనేది లేకుండా పోయింది. దీంతో… పురుషుల్లో అసహనం పెరిగిపోతోంది. టికెట్‌ కొనుక్కుని ప్రయాణిస్తున్న తమకు సీటలు లేకపోతే ఎలా..? అని ప్రభుత్వాన్ని , సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని ప్రశ్నిస్తున్నారు. బస్సుల్లో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇలా ప్రతిరోజు చాల బస్సుల్లో గొడవలు జరుగుతున్న వీడియోస్ సోషల్ మీడియా లో వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న టీఎస్‌ఆర్టీసీ అధికారులు.. బస్సుల్లో పురుషుల కోసం కొన్ని సీట్లు కేటాయిస్తే ఎలా ఉంటుంది… అన్న ఆలోచన చేస్తున్నారు. ప్రతీ బస్సులో 55 సీట్లు ఉంటాయి. వారిలో 20 సీట్లు పురుషులకు రిజర్వ్‌ చేయాలనే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని డిపోల నుంచి వివరాలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. డిపోల వారీగా నివేదికలు వచ్చిన తర్వాత… పురుషులకు ఎన్ని సీట్లు రిజర్వ్‌ చేయాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఒక వేళ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే వారికీ కేటాయించిన సీట్ల ఫై పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అనే స్లోగన్‌ ఉంటుంది కావొచ్చు. చూద్దాం ఏంచేస్తారో..

Read Also : RGV : కొలికపూడి శ్రీనివాసరావు ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వర్మ పిర్యాదు..