Site icon HashtagU Telugu

TSRTC : సిబ్బందికి గుడ్ న్యూస్ తెలిపిన TSRTC

Tsrtc Good News

Tsrtc Good News

TSRTC యాజమాన్యం సిబ్బందికి వరుస తీపి కబుర్లు తెలుపుతూ వారిని సంతోష పరుస్తుంది. గత కొద్దీ రోజులుగా మహిళా ఫ్రీ బస్సు (Free Bus ) సౌకర్యం తో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్న వారికీ పెద్ద రిలీఫ్ ఇచ్చే న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు ప్రస్తుతం వర్తిస్తోన్న ప్రమాద బీమా మొత్తాన్నీ భారీగా పెంచుతున్నట్లు తెలిపింది. దీనికోసం యూబీఐతో ఒప్పందాన్ని కుదర్చుకున్నట్లు ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. యూబీఐ చీఫ్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ భాస్కర్ రావు సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ప్రస్తుతం ఉన్న రూ.40 లక్షల నుంచి కోటి రూపాయలకు ప్రమాద బీమా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దురదృష్టవశావత్తు రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన లేదా శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది. యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద కోటి ప్రమాద బీమా లభిస్తుంది. రూపే కార్డు ద్వారా మరో 12 లక్షల రూపాయల వరకు బీమా మొత్తం పెరుగుతుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు సంస్థ అందిస్తుంది. ఫిబ్రవరి 1వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుందని సజ్జనార్ తెలిపారు. ప్రమాద బీమా మొత్తాన్ని పెంచాలంటూ తాము విజ్ఞప్తి చేసిన వెంటనే యూబీఐ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

Read Also : Telangana: సీఎం రేవంత్ రెడ్డి లండన్ వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నాడు: దాసోజు