Site icon HashtagU Telugu

Sajjanar: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్, సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు

Tsrtc Dasara Services

Tsrtc Dasara Services

Sajjanar: సంక్రాంతికి ఇంటికి వెళ్లాలనుకునే వారికి TSRTC శుభవార్త చెప్పింది. పండుగకు 4,484 ప్రత్యేక బస్సు సర్వీసులు రోడ్లపై తిరుగుతాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. జనవరి 6 నుంచి 15 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా వర్తింపజేస్తామని చెప్పారు.

సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లే వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఛార్జీలు పెంచకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగదు. అలాగే ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్‌బీ నగర్, ఆరంగర్, కేపీహెచ్‌బీ వంటి రద్దీ ప్రాంతాలలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

బస్ భవన్ మరియు మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్‌ల నుండి రద్దీగా ఉండే ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని ఆయన చెప్పారు. ప్రయాణికులు త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా టోల్‌ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధిక చార్జీలు చెల్లించి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించవద్దని, ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ సూచించారు.

Also Read: Yatra 2 Teaser: యాత్ర 2 టీజర్, ఇచ్చిన మాట కోసం నిలబడ్డ తనయుడి కథ!