Site icon HashtagU Telugu

TSRTC : సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేస్తున్న TSRTC

Butter

Butter

తెలంగాణ(Telangana)లో ఎండలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వరకే ఎండ 40 డిగ్రీలకు చేరుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 44 డిగ్రీలకు చేరువయ్యాయి. అదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి. ఫలితంగా జనం ఉక్కపోత, చెమటతో అల్లాడుతున్నారు. ఇంత మండుటెండల్లో ఆర్టీసీ బస్సులు నడపడమంటే ఆర్టీసీ డ్రైవర్లకు పెద్ద సవాలే.. పైన ఎండలు మండుతుంటే, కింద ఇంజన్ వేడికి డ్రైవర్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు వామ్మో అని భావిస్తారు..ఈ తరుణంలో TSRTC ఓ చల్లటి కబురు అందించింది.

We’re now on WhatsApp. Click to Join.

వేసవిలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లతో పాటు మిగతా సిబ్బందికి మజ్జిగ (buttermilk ) పంపిణీ చేయాలనీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని డిపోలలో ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు మజ్జిగ పంపిణి చేయాలనీ ఆదేశించింది. ఈరోజు నుండి ఈ పంపిణీ మొదలుకానుంది. ఇక గ్రేటర్ పరిధిలో సుమారు ఎనిమిదిన్నర గంటలకు పైగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఉపశమనం కల్గించేందుకు మజ్జిగను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అది తమ సిబ్బందికి ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే ఆర్టీసీ సిబ్బందికి అందరికి డిపోల వారీగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, బీపీ, షుగర్ వంటి వాటిని చెక్ చేస్తూ… ఇతర సమస్యలు ఉన్నవారిని ఆసుపత్రికి పంపించి చికిత్స చేయిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Read Also : Vistara : విస్తారాలో సంక్షోభం.. 15 మంది సీనియర్ పైలట్ల రాజీనామా