Site icon HashtagU Telugu

TSRTC Discount : హైదరాబాద్ టు విజయవాడ, బెంగళూరు ఆర్టీసీ టికెట్లపై డిస్కౌంట్

Tsrtc Discount

Tsrtc Discount

TSRTC Discount : హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు బెంగళూరు రూట్లలో నడిచే పలు బస్సుల్లో టిెకెట్లపై టీఎస్‌ఆర్టీసీ 10 శాతం డిస్కౌంట్ అందించనుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతిరోజు దాదాపు 120 బస్సులు నడుస్తుంటాయి. వీటిలో లహరి ఏసీ స్లీపర్ బస్సులు 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ బస్సులు 62 ఉన్నాయి. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న వారికే టికెట్ ధరపై పదిశాతం రాయితీ లభిస్తుంది. తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకునే వారికి కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సుల టికెట్లను ముందస్తుగా బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ రాయితీ అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ వర్తిస్తుందని ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో టికెట్లను http://tsrtconline.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.  ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్‌లో ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ(TSRTC Discount) ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

Also Read :Actor Sahil Khan : సాహిల్ ఖాన్ పరుగో పరుగు.. తప్పించుకునేందుకు 4 రోజుల్లో 1800 కి.మీ జర్నీ !

ఈ వేసవి సెలవుల్లో భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి రాజధాని ఏసీ బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. ఈ బస్సులు ప్రతి గంటకూ ఒకటి అందుబాటులో ఉంటాయి. జూబ్లీ బస్‌స్టేషన్‌ (జేబీఎస్‌) నుంచి శ్రీశైలానికి ఒక్కరికి టికెట్‌ ధర రూ.524, అలాగే BHEL నుంచి రూ.564 టికెట్‌ ధర ఉంది.

Also Read : Payal Rajput : షార్ట్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న పాయల్ రాజపుత్