Site icon HashtagU Telugu

TSRTC: తాండూరు డిపోలో టి.రాజప్ప ఆత్మహత్యపై టీఎస్‌ఆర్టీసీ క్లారిటీ

TSRTC MD Sajjanar

TSRTC MD Sajjanar

TSRTC: వికారాబాద్‌ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది.

2013లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్‌ఫిట్‌ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్‌ గా డిపోలో పనిచేస్తున్నారు. గత నెలలో అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాజప్ప 12 రోజులు విధులకు గైర్హాజరయ్యారు. అయినా ఆయనకు డ్యూటీని కేటాయించడం జరిగింది. గత మూడు రోజులు నుంచి కూడా విధులకు హాజరుకావడం కాలేదు.

వికారాబాద్‌ జిల్లా యాలాల మండలంలోని తన స్వగ్రామం దౌలపూర్‌లో సోమవారం రాత్రి రాజప్ప ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. రాజప్ప మృతికి సంస్థ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. రాజప్ప ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని తెలుస్తోంది. కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుంటే దానికి సంస్థ అధికారులు బాధ్యులని ఆరోపించడం సరైంది కాదు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవి.