హుజూరాబాద్ (Huzurabad) నుంచి హనుమకొండ (Hanmakonda) వెళ్తున్న పల్లె వెలుగు బస్సు (BUS) పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ లో బస్సు ఉండగా..దానిని వెనుక రెండు చక్రాలు (Bus Wheels Blown) ఊడిపోయాయి. దాంతో ఒక పక్కకు ఒరిగి కొంత దూరం వెళ్లింది. ఎదురుగా ఏమీ రాకపోవడం, బస్సు స్పీడ్ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. దీంతో గత కొద్దీ రోజులుగా మహిళలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణం చేస్తున్నారు. పల్లె వెలుగు , ఆర్డినరీ , ఎక్స్ ప్రెస్ ఇలా ఏ బస్సు కూడా ఖాళీగా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు వరుస సెలవుల నేపథ్యంలో రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో ఆదివారం ఆర్టీసీ బస్సు కు పెను ప్రమాదం తప్పింది.
We’re now on WhatsApp. Click to Join.
హుజూరాబాద్ నుంచి హనుమకొండ వెళ్తున్న పల్లె వెలుగు బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. సమీపంలోని పంట పొలాలకు బస్సు చక్రాలు దూసుకెళ్లాయి. ప్రమాద సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిపై ఎల్కతుర్తి శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. వెనుక చక్రాలు ఊడిపోయి పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. టైర్లు ఊడిపోయి బస్సు ఓ పక్కకు ఒరగడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డాయి. ఈ సమయంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును కంట్రోల్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో 80 మంది ప్రయాణించినట్లు తెలుస్తుంది. ఓవర్ లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
Read Also : KTR : ‘ప్రజా దర్బార్’ పొమ్మంది.. ‘తెలంగాణ భవన్’ రమ్మంది.. ఇల్లందు అన్నపూర్ణకు కేటీఆర్ సాయం