Site icon HashtagU Telugu

TGS RTC LOGO : టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ఫేకా ? నిజమైందేనా ? సజ్జనార్ క్లారిటీ

Tgs Rtc Logo

Tgs Rtc Logo

TGS RTC LOGO : తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ప్రతీ విభాగంపై తనదైన ముద్రవేసే దిశగా ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈక్రమంలోనే టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా ఇటీవలే మార్చింది. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో డిజైన్‌ను ఇంకా ఫైనల్ చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో దీనిపై తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో ఇదేనంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ లోగో మారిందనే ప్రచారాన్ని ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఖండించారు.  కొత్త లోగో ఇంకా రెడీ కాలేదని వెల్లడించారు. అధికారికంగా ఇప్పటివరకు టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగోను విడుదల చేయలేదని స్పష్టం చేశారు.  ప్రయాణికులు ఇకపై తమ సూచనలు, ఫిర్యాదులను @tgsrtcmdoffice, @tgsrtchq ఖాతాల ద్వారా అందించవచ్చన్నారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రభుత్వ విభాగాలన్నీ ఇక నుంచి తెలంగాణను టీఎస్‌ బదులుగా టీజీగానే ప్రస్తావించాలని గతంలో తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతిని ఇచ్చింది.  ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.  ఈ క్రమంలో అధికారిక సమాచారాలు, జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో  అంతటా ‘టీజీ’ అనే పదాన్ని ప్రస్తావిస్తున్నారు.  ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలలో కూడా టీజీని వాడుతున్నారు. టీఎస్ అని ముద్రించిన స్టేషనరీ, ప్రింటింగ్ మెటీరియల్‌ను తొలగించి, టీజీతో కొత్తగా ముద్రిస్తున్నారు.

Also Read :Vidyadhan : టెన్త్‌లో 90 శాతం మార్కులు వచ్చాయా ? ఈ స్కాలర్‌షిప్ మీకే

Exit mobile version