వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ మంచి పర్యాటక కేంద్రంగా ఉంది. సెలవుల్లో చిన్న పెద్ద అందరూ అనంతగిరి హిల్స్‌కు క్యూ కడుతున్నారు. అనంతగిరి హిల్స్ సందర్శన కోసం పర్యాటకులు ఇబ్బందులు పడకుండా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరం నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ వరకు పర్యాటకులు తీసుకెళ్లి.. తీసుకువచ్చేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. కేపీహెచ్‌బీ నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ప్రత్యేక బస్సు 10 గంటలకు అనంతగిరి కొండలకు చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు సాయంత్రం 4 గంటలకు అనంతగిరి కొండల నుండి బయలుదేరి రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ బస్సు ప్రసిద్ధ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, బుజ్జ రామేశ్వర ఆలయం, కోట్‌పల్లి రిజర్వాయర్ మరియు ఇతర పర్యాటక ఆకర్షణలకు పర్యాటకులను తీసుకువెళుతుంది. టీఎస్ఆర్టీసీ ప్రవేశ రుసుము, గైడ్ రుసుము, అల్పాహారం, మధ్యాహ్న భోజన ఖర్చులు ప్రయాణికులే చెల్లించాలి. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీ పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.150గా ఉంటుంది.
Ananthagiri Hills : అనంతగిరి హిల్స్ వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రతి రోజు..!

Tsrtc Buses Imresizer