Group I Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే.. ?

గ్రూప్ I ప్రిలిమ్స్ ఎగ్జామ్ (Group I Prelims) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందింది.

Published By: HashtagU Telugu Desk
Group I Prelims

Group I Prelims

గ్రూప్ I ప్రిలిమ్స్ ఎగ్జామ్ (Group I Prelims) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందింది. జూన్ 11న ప్రిలిమ్స్(Group I Prelims) నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెల్లడించింది. OMR ఆధారిత ఆఫ్‌లైన్ ఫార్మాట్‌లో ఈ పరీక్ష జరుగుతుందని ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

also read : TS Jobs : గ్రూప్ 1తో స‌హా ఉద్యోగాల‌కు 49 ఏళ్ల స‌డ‌లింపు

2022 ఏప్రిల్‌ 26న తెలంగాణలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తూ టీఎస్పీఎస్పీ ఫలితాలను విడుదల చేసింది. అనంతరం అనూహ్యంగా పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. రీషెడ్యూల్ చేసిన పరీక్షలకు కమిషన్ తాజా తేదీలను ప్రకటించింది.

  Last Updated: 17 May 2023, 09:02 AM IST