Site icon HashtagU Telugu

TSPSC: నిరుద్యోగులకు అలెర్ట్: పరీక్షలకు కొత్త షెడ్యూల్

Tspsc

Tspsc

TSPSC: ప్రశ్న పత్రాల లీకేజీతో పలు టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ పరీక్షల కొత్త తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇనస్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్, వాటర్ డిపార్ట్ మెంట్ లోని గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ పోస్టులు, డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ వంటి వాటికి కొత్త తేదీలను ప్రకటించారు. ఈ నెల 23న జరగాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష జూన్ 28కి మార్చారు. ఈ నెల 25న జరగాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ మే 16కి న నిర్వహిస్తారు.గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ గెజిటెడ్ పోస్టుల ఎగ్జామ్ జూలై 18,19న జరుపుతారు. ఈ పరీక్షను ముందుగా ఈ నెల 26, 27న నిర్వహించాలి. మే 7న నిర్వహించాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్ మే 19కి మార్చడం జరిగింది.

ఈ పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను అభ్యర్థులు తెలుసుకుని పరీక్షలకు ప్రిపేర్ కావాలని కోరింది కమిషన్. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు ఈడీ పరిశీలిస్తుంది. ఈ కేసులో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానిస్తోంది.

Read More: Morning Works : ఉదయం లేవగానే ఇలా చేయండి.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.. కొన్ని పనులు అస్సలు చేయకూడదు..