TSPSC Notification: 563 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్

తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టుల కోసం

TSPSC Notification: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టుల కోసం గ్రూప్-1 పరీక్షల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గతంలో 503 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరో 60 పోస్టులు పెంచి 563 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 మధ్య ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 14 సాయంత్రం 5 గంటల తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవని సర్వీస్ కమిషన్ తెలిపింది. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను ఫిబ్రవరి 23 మరియు మార్చి 23 మధ్య సవరించవచ్చు. హాల్ టిక్కెట్లను పరీక్ష ప్రారంభానికి నాలుగు గంటల ముందు వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థుల వయో పరిమితిని రేవంత్ సర్కార్ పెంచింది. వయోపరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచింది. రెండేళ్లక్రితమే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఆ సమయంలో పేపర్ లీక్ కావడం ద్వారా సంచలనంగా మారింది. దీంతో పరీక్షల్ని ప్రభుత్వం రద్దు చేసింది. రెండోసారి నిర్వహించిన ఎగ్జామ్‌లలో కూడా అవకతవకలు జరగడంతో పాత నోటిఫికేషన్‌ని మొత్తానికే రద్దు చేసింది. ఇప్పుడైనా పరీక్షలను సజావుగా జరిపించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Also Read; Dhanush Rayan First Look : ధనుష్ రాయన్ లుక్ చూశారా..?