Site icon HashtagU Telugu

Group 4 Results : గ్రూప్-4 ఫ‌లితాలను విడుదల చేసిన TSPSC

Group4 Results

Group4 Results

గ్రూప్-4 ఫ‌లితాలను (Group 4 Results) TSPSC విడుదల చేసింది. మెరిట్ జాబితా విడుద‌ల చేసిన‌ట్లు టీఎస్‌పీఎస్సీ (TSPSC ) వెల్ల‌డించింది. గ్రూప్-4 కింద 8,180 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడిన సంగ‌తి తెలిసిందే. 7,26,837 మందిని మెరిట్ జాబితాలో పేర్కొన్నారు. ఇటీవ‌లే తెలంగాణ ప్ర‌భుత్వం 6,956 మందికి స్టాఫ్‌ నర్స్ ఉద్యోగాల ఫ‌లితాల‌ను విడుద‌ల చేసి.. వారికి నియామక పత్రాల‌ను కూడా అందజేసింది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా గురుకుల ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేసింది. ఇక ఇప్పుడు గ్రూప్-4 ఫ‌లితాలను విడుదల చేసింది. కొత్త ఏర్పాటైన టీఎస్‌పీఎస్సీ బోర్డ్ ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో శుక్రవారం గ్రూప్‌-4 ఫ‌లితాల విడుద‌ల చేసి నిరుద్యోగుల్లో ఆనందం నింపారు. అలాగే.. ప్రభుత్వం అనుమతి తీసుకోని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధమవుతోంది.

Read Also : Srisailam Temple : శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం..ప్రసాదంలో మాంసపు ముక్క