Group 4 Final Results: ఉద్యోగార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్-4 ఫలితాలను (Group 4 Final Results) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్ జాబితా టీజీపీఎస్సీ ప్రకటించింది. తాజాగా గ్రూప్-4 ఫలితాలు వెల్లడయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ లిస్టును టీజీపీఎస్‌సీ సైట్‌లో పొందుపర్చారు. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి 2023 జూలైలో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. తాజాగా తుది ఫలితాలను రిలీజ్ చేశారు. ప్రొవిజనల్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ -4 తుది ఫలితాలు విడుదల చేశామని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 డిసెంబర్ ఒకటిన 8,180 పోస్టుల భర్తీకి గ్రూప్ -4 నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 9,51,321 మంది ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2023 జూలై ఒకటిన రాత పరీక్ష నిర్వహించారు.
Also Read: Nasa Satellite Pictures: షాకింగ్ ఫొటోలను విడుదల చేసిన నాసా!
రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వాళ్లతో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ జాబితా విడుదల చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 8,084 మంది అభ్యర్థులతో కూడి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ గురువారం విడుదల చేశామని ఆయన వెల్లడించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్ సైట్ ను సందర్శించాలని ప్రకటించారు. టీజీపీఎస్సీ సెక్రటరీ ప్రకటన ప్రకారం మరో 96 పోస్టులను భర్తీ చేయకుండా పెండింగ్ పెట్టినట్లు ఆయన వివరించారు.