Site icon HashtagU Telugu

Group 4 Exam Instructions: రేపే గ్రూప్‌ 4 పరీక్ష.. ఈ సూచనలు మరిచిపోవద్దు..!

SSC CHSL Exam 2024

SSC CHSL Exam 2024

Group 4 Exam Instructions: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 4 పరీక్షకు(TSPSC Group 4 Exam) సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్టు సంబంధిత అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించే ఈ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరు ఉన్నారు. ఇప్పటికే హాల్ టికెట్స్ విడుదల చేశారు అధికారులు. జులై 1న జరిగే ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన కొన్ని కీలక సూచనలు (Group 4 Exam Instructions) చేసింది.

కీలక సూచనలు

– గ్రూప్‌ 4 పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు.

-పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్‌-2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.

– అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్‌కు ఫొటో గుర్తింపుకార్డు చూపించాలి.

– మాల్ ప్రాక్టీస్ కి పాల్పడితే పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆ అభ్యర్థిని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారు.

– అభ్యర్థులు ప్రశ్నపత్రంపై సమాధానాలను మార్క్‌ చేయకూడదు.

– ఓఎంఆర్‌ పత్రంలో బ్లూ/బ్లాక్‌ పెన్‌ మాత్రమే ఉపయోగించాలి.

– హాల్‌టికెట్‌, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ/ బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌కాకుండా ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌, పెన్సిల్‌ ఉపయోగించినా ఓఎంఆర్‌ పత్రం చెల్లుబాటు కాదు.

– ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విలువైన, నిషేధిత వస్తువులు తీసుకెళ్లొద్దు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకొని వెళ్ళకూడదు.

Also Read: Telangana Congress : తెలంగాణ‌పై రాహుల్ గాంధీ ఫోక‌స్‌.. భ‌ట్టి పీపుల్స్ మార్చ్‌పై ఆరా

TSPSC వివిధ ప్ర‌భుత్వ‌ విభాగాల్లో 8,039 ఖాళీల కోసం గ్రూప్ – IV రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని కోసం 9.50 లక్షల మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. జులై 1న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. మొత్తం 300 మార్కులకు ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్) 150 మార్కులు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) 150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి.