Site icon HashtagU Telugu

Group 4 Merit List : గ్రూప్-4 జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల ఎప్పుడంటే.. ?

TGPSC NEW UPDATE

Group 4 Merit List : గ్రూప్‌-4 సర్వీసు పోస్టుల జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ  దసరా పండుగ తర్వాత విడుదల చేయనుంది. అభ్యర్థుల మార్కులు, జిల్లా స్థానికత, కేటగిరీ తదితర వివరాలు ఈ లిస్ట్‌లో ఉంటాయి. మహిళలకు సమాంతర రిజర్వేషన్‌పై హైకోర్టు నుంచి క్లారిటీ వచ్చాక, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 1:2 నిష్పత్తి ప్రకారం గ్రూప్ 4 పోస్టులకు ఎంపికైన వారి ఫైనల్ లిస్టును విడుదల చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

గ్రూప్​-4 రిక్రూట్మెంట్ లో భాగంగా జూనియర్​ అసిస్టెంట్​, జూనియర్​ అకౌంటెంట్​, జూనియర్​ ఆడిటర్​, వార్డు ఆఫీసర్ వంటి మొత్తం 8,180 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జులై 1న జరిగిన గ్రూప్ 4 రాత పరీక్షను 7.6 లక్షల మంది అభ్యర్థులు రాశారు. దీని తుది కీని రిలీజ్ చేసిన  టీఎస్‌పీఎస్‌సీ పేపర్-1లోని ఏడు, పేపర్-2లోని మూడు ప్రశ్నలను తొలగించింది. అయితే రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా.. వీటిలో ఐదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా టీఎస్​పీఎస్సీ పేర్కొంది. ఈమేరకు మార్పులతో తుది కీని రిలీజ్ చేసిన తరువాత అభ్యర్థుల జవాబు పత్రాల వ్యాల్యుయేషన్ ను పూర్తి చేసింది. ఇప్పుడు దసరా తర్వాత జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాను విడుదల చేయబోతోంది. దీనికోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ​తో నవంబరులో జరగాల్సిన గ్రూప్​-2 పరీక్ష జనవరికి వాయిదా పడింది.

Also Read: Revanth Reddy Arrest : రేవంత్ రెడ్డి అరెస్ట్..హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత