TSPSC Group 1 Result: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు వెల్లడి.. మెయిన్స్ కు 25,050 మంది అర్హత

హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది అక్టోబరులో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాల (TSPSC Group 1 Result)ను శుక్రవారం రాత్రి వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్ష 16 అక్టోబర్ 2022న నిర్వహించబడింది.

  • Written By:
  • Publish Date - January 14, 2023 / 11:05 AM IST

హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది అక్టోబరులో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాల (TSPSC Group 1 Result)ను శుక్రవారం రాత్రి వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్ష 16 అక్టోబర్ 2022న నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా 1000 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 3 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 2.86 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా అందులో 25,050 మంది మెయిస్ పరీక్షలు రాయడానికి అర్హత పొందినట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. మెయిన్స్ రాత పరీక్షలు జూన్ నెలలో నిర్వహించే అవకాశాలున్నట్లు పేర్కొన్నది. పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలు ఈ నెల 18న వెల్లడించనున్నట్లు తెలిపింది.

Also Read: India vs New Zealand: కివీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే.. భారీ మార్పులు చేసిన బిసిసిఐ..!

మొత్తం 503 పోస్టుల భర్తీ కోసం 25,050 మంది మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హత సాధించినట్లు వివరించింది. మెయిన్స్ పరీక్షల్లో ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చినట్లయితే స్థానికతను ప్రామాణికంగా తీసుకుని ఖరారు చేయనున్నట్లు వివరించింది. ప్రిలిమ్స్ పరీక్షల్లో ఓఎంఆర్‌లో తప్పుడు పద్ధతిలో బబ్లింగ్ చేసినా, అసలు చేయకపోయినా వారిని మెయిన్స్ పరీక్షలు రాయడానికి అనర్హులను చేసినట్లు కమిషన్ పేర్కొన్నది.

అక్టోబర్‌ నెలలోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో ఆలస్యమైంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలకు బుధవారమే హైకోర్టు బెంచ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో శుక్రవారం టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల చేసింది. ప్రిలిమ్స్ ఫలితాలపై సందేహాలున్న అభ్యర్థులు కమిషన్‌కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 మధ్యలో ఫోన్ చేయవచ్చని నెంబర్: 040-23542185, 040-22445566, 040-23542187 తెలిపింది.