గ్రూప్-1పై TSPSC కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 పోస్టులకు కటాఫ్ మార్కులు ఉండవని ప్రకటించింది. మెయిన్స్‌కు షాట్ లిస్ట్ చేయడానికి మాత్రమే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగిందని అధికారులు వెల్లడించారు. జోన్‌లలో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్ల ఆధారంగా నియామకాలు జరుగుతాయని వెల్లడించింది. ఖాళీలను బట్టి ఒక్కో కేటగిరీలో ఒక్కో పోస్టుకు 1: 50 చొప్పున మెయిన్స్‌కి క్వాలిఫై చేస్తామని అధికారులు ప్రకటించారు. అందుకు సంబంధించి గతంలోనే జీవో నెం. 55 జారీ అయిందని ఈ ప్రకటనలో ప్రస్తావించింది. మొత్తం ఖాళీలను బట్టి చూస్తే.. యాభై రెట్ల మంది మెయిన్స్‌కు క్వాలిఫై అవుతారని అందులో స్పష్టం చేసింది.