Site icon HashtagU Telugu

TSPSC : రేవంత్ రెడ్డి లీక్స్ దెబ్బ‌! ఈడీకి పేప‌ర్ లీక్ భాగోతం!

Tspsc

Tspsc

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ (TSPSC) వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మ‌లుపులు తిరుగుతోంది. పేప‌ర్ లీక్ అంశాన్ని ప‌ర‌స్ప‌రం రాజ‌కీయ ఆరోప‌ణ‌ల వైపు మ‌ళ్లించారు. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), బీజేపీ తెలంగాణ ఇంచార్జి బండి సంజ‌య్ కు సిట్ నోటీసులు జారీ చేసే వ‌ర‌కు ఇష్యూ వెళ్లింది. లీకేజీ. వెనుక ప్ర‌ధాన నిందితులుగా ప్ర‌వీణ్ కుమార్‌, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, రేణుక ఉన్నారు. వీళ్ల‌తో పాటు మంత్రి కేటీఆర్ పీఏగా ఉన్న తిరుప‌తిని సీన్లోకి లాగారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తోన్న ఆరోప‌ణ‌ల మేర‌కు తిరుప‌తి స‌హాయ‌స‌హ‌కారాల‌తో టీఎస్ పీఎస్ పేప‌ర్ లు లీకవుతున్నాయి. మొత్తం లింకు మంత్రి కేటీఆర్ వ‌ద్ద ఉంద‌ని తీవ్ర ఆరోప‌ణ‌ల‌కు దిగారు. ఆయ‌న‌తో పాటు బండి సంజ‌య్ కూడా సిరిసిల్ల ప్రాంతంలోని మండ‌ల లీడ‌ర్ల బంధువుల కుటుంబీకుల‌కు మార్కులు అత్య‌ధికంగా వ‌చ్చాయ‌ని ఆరోప‌ణాస్త్రాల‌ను సంధించారు.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్  వ్య‌వ‌హారం రాజ‌కీయం(TSPSC) 

విప‌క్షాలు, ప్ర‌జా, విద్యార్థి సంఘాల తిరుగుబాటు క్ర‌మంలో ప్ర‌త్యేక సిట్ ను తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాన నిందితులు ప్ర‌వీణ్ కుమార్, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, రేణుక త పాటుగా 15 మంది నిందితుల‌ను ప్ర‌శ్నించింది. ల‌క్ష‌లాది రూపాయాలు చేతులు మారిన‌ట్టు గుర్తించింది. ఆ న‌గ‌దు ఎక్క‌డ నుంచి ఎక్క‌డ‌కు వెళ్లింది? అనే దానిపై ఆరా తీస్తోంది. విదేశాల్లోని కొంద‌రు పేప‌ర్ కొనుగోలు కోసం డ‌బ్బును త‌ర‌లించార‌ని ప్రాథ‌మికంగా గుర్తించార‌ని తెలుస్తోంది. ఇలాంటి అంశాల‌ను ప‌క్క‌న పెట్టి ఆరోప‌ణ‌లు చేస్తోన్న రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. వాళ్ల‌ను విచార‌ణ‌కు పిలిచింది. ఆధారాలు ఉంటే చూపాల‌ని వాళ్ల‌ను నిల‌దీసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిట్ ఎదుట హాజ‌ర‌య్యారు. మంత్రి కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు.

మంత్రి కేటీఆర్ ను బ‌ర్త ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్

మంత్రి కేటీఆర్ పేచీ నుంచి న‌డిచిన వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని కోరారు. అంతేకాదు, మంత్రి కేటీఆర్ ను బ‌ర్త ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. సిట్ కు బ‌దులుగా సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేయాల‌ని కోరారు. ఇదే డిమాండ్ ను బీజేపీ కూడా వినిపిస్తోంది. నిందితుల్లో ఒక‌రు రాజ‌శేఖ‌ర్ రెడ్డి బీజేపీ కార్య‌క‌ర్త‌గా మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. బీజేపీ వైపు పేప‌ర్ లీకు (TSPSC) కేసును మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేశారు. అంతేకాదు, బండి సంజ‌య్ అనుచ‌రుల‌కు కూడా పేప‌ర్ లీకు వ్య‌వ‌హారంలో ప్ర‌మేయం ఉన్న‌ట్టు రాజ‌కీయ గేమ్ న‌డిచింది. పేప‌ర్ లీకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయ‌ని ఎదురుదాడికి దిగారు. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసేది లేద‌ని తేల్చేశారు.

Also Read : TSPSC: అభ్యర్థులకు అలర్ట్.. ఏఈఈ పరీక్ష కొత్త తేదీలు ప్రకటించిన TSPSC

గ‌త రెండు వారాలుగా జరుగుతోన్న పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నిస్తోన్న కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు స‌రైన స‌మ‌యంలో రంగంలోకి దిగ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. ఇప్ప‌టికే ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడ‌ర్ బ‌క్కా జ‌డ్స‌న్ న్యాయ‌పోరాటానికి కూడా దిగుతున్నారు. ప్ర‌భుత్వం మాత్రం టీఎస్ పీఎస్ చైర్మ‌న్ జ‌నార్థ‌న్ రెడ్డి ని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆయ‌న మీద రేవంత్ రెడ్డి ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న ప్ర‌భుత్వంలో ప‌నిచేస్తున్న‌ప్పుడు చేసిన భూ దందాల‌ను బీజేపీ బ‌య‌ట పెడుతోంది. ఇలా ప‌ర‌స్ప‌రం తెలంగాణ‌లోని రాజ‌కీయ పార్టీలు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డాన్ని గ‌మ‌నించిన కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగ‌నుంద‌ని తెలుస్తోంది.

Also Read : Revanth Reddy: TSPSC ఎఫెక్ట్.. రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్