Group 1 Alert : గ్రూప్-1 దరఖాస్తులో మార్పులు చేయాలా.. ఇవి తెలుసుకోండి

Group 1 Alert : తెలంగాణలో గ్రూప్‌-1 పోస్టులకు అప్లై చేసిన వారికి కీలకమైన సమాచారం ఇది.

  • Written By:
  • Updated On - March 23, 2024 / 11:02 AM IST

Group 1 Alert : తెలంగాణలో గ్రూప్‌-1 పోస్టులకు అప్లై చేసిన వారికి కీలకమైన సమాచారం ఇది. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు ఈరోజు నుంచి మార్చి 27 వరకు అవకాశం ఉంది.  ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మార్చి 27న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులోని వివరాలను అభ్యర్థులు మార్చుకోవచ్చు. వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్‌ చేయాల్సి ఉంటుంది. మెయిల్‌ లేదా నేరుగా వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఏయే అంశాలనైతే ఛేంజ్ చేస్తారో.. వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను తప్పనిసరిగా పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈదఫా ఒక్కసారి వివరాలను సవరించిన తర్వాత.. మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వరు.  అభ్యర్థులు తమ పేరు, పుట్టినతేదీ, జెండర్, విద్యార్హతలు, ఫోటో, సంతకం తదితర వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తుల్లో ‘Un- Employee’ స్టేటస్ నుంచి ‘Employee’ కిందికి మార్చుకోవాలంటే పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. గ్రూప్‌-1కు మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్లు.. 

  • పేరు, పుట్టినతేదీ, జెండర్ వివరాల మార్పు కోసం:  పదోతరగతి లేదా తత్సమాన సర్టిఫికెట్
  • కమ్యూనిటీ ఓసీ నుంచి ఇతర కేటగిరీ మార్పు కోసం – కమ్యూనిటీ సర్టిఫికెట్, బీసీ అయితే నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్
  • ఈడబ్ల్యూఎస్ (NO/ YES) మార్పు కోసం – ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్
  • పీహెచ్ (NO/ YES)/ పీహెచ్ కేటగిరీ మార్పు కోసం – పీహెచ్ (సదరం) సర్టిఫికెట్
  • ఎక్స్-సర్వీస్‌మెన్ (NO/ YES) మార్పు కోసం – ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికెట్
  • స్పోర్ట్స్ (NO/ YES) మార్పు కోసం – స్పోర్ట్స్ సర్టిఫికెట్
  • ఎన్‌సీసీ (NO/ YES) మార్పు కోసం – ఎన్‌సీసీ సర్టిఫికెట్
  • ఉద్యోగి అయితే (NO/ YES) మార్పు కోసం – సర్వీస్ సర్టిఫికెట్
  • 1-7వ తరగతి స్టడీసర్టిఫికెట్/రెసిడెన్స్ సర్టిఫికెట్ –  స్టడీ/రెసిడెన్స్ సర్టిఫికెట్

Also Read : Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. మీడియా సంస్థ అధినేత, పోలీసు అధికారుల ఇళ్లలో సోదాలు

గ్రూప్-1లోని మొత్తం 563 పోస్టులకుగానూ మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు 140, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పోస్టులు 115 ఉన్నాయి. మొత్తం 150 మార్కులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్స్ (6 పేపర్లు) పరీక్ష జరుగుతాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు.

Also Read :YSRCP Slogan : ‘జగన్ చెప్పిందే చేస్తాడు.. చేయలేనిది చెప్పడు’.. ఇదే వైసీపీ ఎన్నికల నినాదం