AP vs TS : తెలంగాణ‌ను అవ‌మానిస్తే నాలుక కోస్తాం.. మంత్రి బొత్స‌కు టీఎస్ఎమ్ఐడీసీ ఛైర్మ‌న్ ఎర్రోళ్ల హెచ్చ‌రిక‌

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై తెలంగాణ మంత్రులు, నాయ‌కులు ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీపై మంత్రి బొత్స చేసిన

  • Written By:
  • Updated On - July 14, 2023 / 03:52 PM IST

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై తెలంగాణ మంత్రులు, నాయ‌కులు ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్య‌ల‌ను టీఎస్ఎమ్ఐడీసీ ఛైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖండించారు. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆయ‌న బొత్స‌ను హెచ్చ‌రించారు. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంద్రప్రదేశ్ మాత్ర‌మేన‌ని.. సెక్రటేరియట్ ఉద్యోగుల లెక్క సోమవారం నుంచి శనివారం వరకు ఏపీలో ఉండి… శనివారం సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారని ఆయ‌న ఎద్దేవా చేశారు. తెలంగాణను అవమానించే వాళ్లకు హైదరాబాద్ లో అడుగుపెట్టే అర్హత లేద‌న్నారు. గ‌తంలో APPSC- చిపిపిఎస్సి అనే వార్తలు వ‌చ్చాయ‌ని.. ఆప్ట్రల్ అనే వాళ్లకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగే హక్కు లేదని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలంగాణను అవమాణిస్తే- నాలుకలు తెగోస్తామంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 2021 నుంచి 2023 వరకు ప్రతీ ఏటా ఏపీ నుంచి వేల సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు తెలంగాణకు వచ్చి చదువుకుంటున్నారన్నారు. ఆల్ ఇండియా బట్టేవాజ్ సంఘానికి అరవింద్ ను ప్రెసిడెంట్ చేయాలి.. ఎంపీ అరవింద్ ఒక బ్రోకర్ అంటూ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్, హరీష్ రావు గురించి ఇష్ట‌మోచ్చిన‌ట్లు మాట్లాడితే బ‌ట్ట‌లుడ‌దీసీ కొడ‌తామంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యాఖ్య‌లు చేశారు.