TS SI Constable Events Dates: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 8 నుంచి ఈవెంట్స్..!

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేసింది

Published By: HashtagU Telugu Desk
Police Recruitment In Telangana

Police Recruitment In Telangana

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. ఎంపిక ప్రక్రియలో కీలకమైన ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ)లు డిసెంబర్ 8 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

డిసెంబర్ 8, 2022 నుంచి PMT, PET టెస్టులు ప్రారంభం అవుతాయని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈవెంట్స్ ఉంటాయని తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట ఉన్నాయి. 23-25 రోజుల్లో జనవరి లోపు ఈ ప్రాసెస్ పూర్తవుతుందని పేర్కొంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

ఈవెంట్స్ కు సంబంధించి అడ్మిట్ కార్డులను నవంబర్ 29 ఉదయం 8 గంటల నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ అడ్మిట్ కార్డులను డిసెంబర్ 03, 2022 వరకు వెబ్ సైట్లో ఉంచనున్నారు. వీటిని అభ్యర్థులు వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను ఉపయోగించి https://www.tslprb.in/ వెబ్ సైట్లో లాగిన్ అయి డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈవెంట్స్ కేంద్రాలు, అడ్మిట్ కార్డులు, అభ్యర్థులు పాటంచాల్సిన నిబంధనలను అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

  Last Updated: 27 Nov 2022, 12:13 PM IST