Site icon HashtagU Telugu

TSLPRB SI Constable Events: తెలంగాణ పోలీసు అభ్యర్థులకు అలర్ట్

Police Recruitment In Telangana

Police Recruitment In Telangana

తెలంగాణ పోలీసు అభ్యర్థులకు కీలక సమాచారం. రేపటి నుండి ఎస్సై, కానిస్టేబుల్ (SI Constable Events) అభ్యర్థులకు ఈవెంట్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు TSLPRB ముఖ్య ప్రకటన చేసింది. అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికి రాకుంటే అభ్యర్థిత్వం రద్దు అవుతుందని తెలిపింది. మైదానాల్లో సామాన్లు భద్రపరుచుకునేందుకు క్లాక్ రూంలు అందుబాటులో ఉండవని, మహిళా అభ్యర్థులు నగలు, హ్యాండ్ బ్యాగ్ లు తీసుకురావొద్దని తెలిపింది. అలాగే చేతివేళ్లకు మెహందీ, టాటూలను వేసుకురావొద్దని, గ్రౌండ్ లోకి సెల్ ఫోన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది.

Also Read: MLA Rasamayi: కేసీఆర్, కేటీఆర్ కంటే నేనే ఎక్కువ చదివా : ఎమ్మెల్యే రసమయి

(SI Constable Events) ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఈవెంట్స్‌కు ఏం తీసుకెళ్లాలంటే

– అడ్మిట్‌ కార్డు/ఇంటిమేషన్‌ లెటర్‌

– పార్ట్‌-2 దరఖాస్తు ప్రింటవుట్‌ కాపీ

– కమ్యూనిటీ సర్టిఫికెట్‌ కాపీ

– డిశ్చార్జ్‌ బుక్‌/NOC/ పెన్షన్‌ పేమెంటల్‌ ఆర్డర్‌ కాపీ

– ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్

తొలుత రన్నింగ్‌లో పాల్గొనాలి. అందులో క్వాలిఫై అయితే ఎత్తు కొలుస్తారు. ఎత్తులో అర్హత సాధించిన వారినే లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు.