TET Results : ఈ నెల 15న జరిగిన తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రిజల్ట్స్ రేపు (బుధవారం) రిలీజ్ కానున్నాయి. పేపర్-1 ఎగ్జామ్ ను 2.26 లక్షల మంది రాయగా, పేపర్-2 ఎగ్జామ్ కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 27న రిజల్ట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్‌సీఈఆర్‌టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే టెట్ ప్రాథమిక ‘కీ’ కూడా విడుదలైంది. రేపు తుది ‘కీ’తో పాటు రిజల్ట్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. టెట్ లో క్వాలిఫై అయ్యేవారు వచ్చే నెలలో జరగబోయే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు దరఖాస్తు చేసే వీలుంది. ఈ కారణంగా టెట్ ఫలితాలను తప్పకుండా 27వ తేదీనే రిలీజ్ చేయాలనే అధికారులు (TET Results) డిసైడ్ అయ్యారు.
Also read : RBI Governor Das: ఖాతాదారుల డబ్బును సురక్షితంగా ఉంచడం చాలా పుణ్యం: ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ఆగస్టు 20న జరిగిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సోమవారం విడుదల చేసింది. మొత్తం 29 లక్షల మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. పేపర్–1కు (1–5 తరగతి బోధకు అర్హత) 15 లక్షల మంది, పేపర్–2కు (6–8 తరగతులకు బోధనకు అర్హత) 14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హత సాధిస్తే దేశవ్యాప్తంగా ప్రముఖ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసే వీలుంటుంది.