తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇవాళ జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ గా తేలింది. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని రోజులు హోం ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో స్పీకర్ హోం ఐసోలేషన్ కు వెళ్లారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని స్పీకర్ తెలిపారు.
TS: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్..!!

pocharam srinivas