TS SET 2023 : తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) కు సంబంధించిన కీలక అప్ డేట్ వచ్చింది. ఆ ఎగ్జామ్ కు సంబంధించిన హాల్‌టికెట్లను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్లో ఇవాళ విడుదల చేసింది. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరింది. అక్టోబరు 28 నుంచి 30 వరకు టీఎస్ సెట్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు ప్రభుత్వం ఏటా టీఎస్ సెట్ ఎగ్జామ్ నిర్వహిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
29 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరుగనుంది. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మూడు గంటలపాటు పరీక్ష జరుగుతుంది. సబ్జెక్టుల విషయానికి వస్తే.. జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ ల వారికి ఎగ్జామ్ జరుగుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డిలలో (TS SET 2023) పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.