Site icon HashtagU Telugu

Summer Holidays 2023: తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు.. 48 రోజుల పాటు సెలవులు..!

Govt Schools

Govt Schools

తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవుల (Summer Holidays)పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్ మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

మార్చి రెండో వారం నుంచి రాష్ట్రంలో స్కూళ్లను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ముందస్తుగా పెరుగుతున్న వేడిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం పిల్లలకు, తల్లిదండ్రులకు పెద్ద ఊరటనిచ్చింది. మార్చి రెండో వారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో హాఫ్ డే అమలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో పాఠశాలలు ఉదయం ఎనిమిది గంటలకు తెరిచి మధ్యాహ్నం 12:30 గంటలకు తరగతులు మూసివేయబడతాయి.

Also Read: New Governor Of AP: ఏపీకి కొత్త గవర్నర్‌గా అబ్దుల్ నజీర్.. ఎవరీ అబ్దుల్ నజీర్..?

ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 20 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. పాఠశాలలు తిరిగి జూన్ 12న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు.. అంటే 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు. ఈమేరకు విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే SSC బోర్డ్ ఎగ్జామినేషన్ కోసం 10వ తరగతి విద్యార్థుల ప్రిపరేషన్ కోసం ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయి.