Site icon HashtagU Telugu

Unique Auction of Fighter Rooster : పందెం కోడిని వేలానికి సిద్ధం చేసిన TSRTC

Rtc Officials To Auction Fi

Rtc Officials To Auction Fi

#TSRTC కోడి పుంజును (Fighter Cock) వేలం (Unique Auction) వేయడం ఏంటి..? TSRTC ఈ పనులు కూడా చేస్తుందా..? అని అంత అనుకోవచ్చు కానీ దీని వెనుక అసలు కథ ఉంది. ఆ కథ మీరు ముందుగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ నెల 9న వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్తున్న బస్సు కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద ఆగిన సమయంలో పందెం కోడిని తన వెంట తీసుకు వెళ్తున్న ప్రయాణికుడు దానిని బస్సులోనే మరిచి వెళ్లిపోయాడు. బస్సులో బ్యాగ్ గమనించిన ప్రయాణికులు విషయాన్ని కంట్రోలర్ దృష్టికి తెచ్చారు. అందులో ఏముందో పరిశీలించేందుకు ఆర్టీసీ సిబ్బంది దానిని తెరిచి చూడగా, భద్రంగా ప్యాక్ చేసి ఉన్న పందెంకోడి కనపడింది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో దాన్ని సంరక్షించేందుకు ఆర్టీసీ సిబ్బంది కరీనంగర్‌(2) డిపోకు తరలించారు. మూడు రోజులుగా సిబ్బంది అటు ఆర్టీసీ బస్సులతో పాటు పందెపుకోడి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో శుక్రవారం వేలానికి డిసైడ్ చేసారు. ఏ మేరకు అధికారులు ప్రకటన చేసారు. కోడిపుంజు కోసం దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారని గత నాలుగు రోజులుగా ఎదురుచూశాం.. అయిన ఎవరూ రాకపోవడంతో ఈరోజు (జనవరి 12) మధ్యాహ్నం మూడు గంటలకు కోడిపుంజును అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో కరీంనగర్ టు డిపో (Karminagar-2 Depot) పరిధిలో బహిరంగ వేలం నిర్వహించబడును ఆసక్తి ఉన్నవాళ్లు ఈ వేలం లో పాల్గొన్నగలరని అధికారులు ప్రకటన చేసారు. ఈ పందెం కోడి బరువు 6 కేజీల వరకు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈరోజుల్లో ఫ్రీ గా ఏది దొరికిన వదిలే రోజులు కావు..అలాంటిది పందెం కోడి..అదికూడా సంక్రాంతి టైం లో దొరికితే మంచిగా వండుకొని తినకుండా దానిని డిపోకు తీసుకెళ్లి..దానికి మంచిగా దాన పెట్టి పోషించారంటే ర్టీసీ కి చేతులెత్తి దండం పెట్టాలి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పందెం కోడి ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Read Also : Ram Mandir: నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరి