TS Reality:మేడిపండులా KCR పాల‌న,తేల్చేసిన కాగ్

కేసీఆర్ మేడిపండు పరిపాల‌న ( TS Reality) కాగ్ నివేదిక ద్వారా బ‌య‌ట ప‌డింది.కేటాయింపులు వాస్త‌వానికి దూరంగా ఉండ‌డాన్ని ప్ర‌శ్నించింది.

  • Written By:
  • Updated On - August 8, 2023 / 01:59 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ మేడిపండు సామెత పరిపాల‌న ( TS Reality) కాగ్ నివేదిక ద్వారా బ‌య‌ట ప‌డింది. బ‌డ్జెట్ లోని కేటాయింపులు వాస్త‌వానికి దూరంగా ఉండ‌డాన్ని ప్ర‌శ్నించింది. పాఠశాల విద్య, క్రీడలు, మునిసిపల్, గిరిజన సంక్షేమం, బిసి సంక్షేమం మరియు ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్లలో పెట్టిన ఖ‌ర్చు నామ‌మాత్రం. ఆయా రంగాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తోన్న తెలంగాణ స‌ర్కార్ ను త‌ప్పుబ‌ట్టింది.

ఎనిమిదేళ్లుగా రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌ల‌ను పెంచుకుంటూ..( TS Reality)

స‌మ‌గ్ర అభివృద్ధి అంటే అన్ని రంగాల‌కు స‌మ‌ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే స‌మ‌తుల్య‌త లోపించకుండా ప్ర‌గ‌తి క‌నిపిస్తోంది. త‌ల‌స‌రి ఆదాయం పెంచామ‌ని చెప్పుకుంటోన్న కేసీఆర్ వాస్త‌వాల‌ను మ‌రిచారు. బిలియ‌ర్ల ఆదాయాన్ని పేద‌ల ఆదాయాన్ని జోడించ‌డం ద్వారా లెక్కించే త‌ల‌స‌రి ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు. సుడో ఆర్థిక‌వేత్త‌ల‌ను త‌యారు చేసేలా కేసీఆర్ స‌ర్కార్ విధానాలు ఉన్నాయ‌ని ఆర్థిక నిపుణులు పాపారావు లాంటి వాళ్లు చెబుతున్నారు. పేద‌, ధ‌నక మ‌ధ్య అంత‌రం పెరిగిపోతుంద‌ని భాగ్య‌న‌గ‌ర్ వాసుల ఆందోళ‌న‌. కోకోపేట భూమి ఎక‌రం 100 కోట్లు ప‌ల‌క‌డాన్ని గొప్ప‌గా చెప్పుకుంటోన్న కేసీఆర్ స‌ర్కార్  ( TS Reality)మేండుపండు పాల‌న గురించి కాగ్ తేల్చేసింది.

బిలియ‌ర్ల ఆదాయాన్ని పేద‌ల ఆదాయాన్ని జోడించ‌డం

హౌసింగ్, పరిశ్రమలు మరియు వాణిజ్యం మరియు ప్రధాన మరియు మధ్యస్థ నీటిపారుదల రంగాలలో తక్కువ ఖర్చు ( TS Reality) కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ సూచించింది. బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి రూ.7,222 కోట్లు కేటాయించగా, రూ.252 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింది. అంటే, వాస్త‌వాల‌కు 97 శాతం దూరంగా ఈ కేటాయింపులు ఉన్నాయ‌ని కాగ్ పేర్కొంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు బడ్జెట్‌లో రూ.1,696 కోట్లు రాగా వాస్తవ వ్యయం రూ.286 కోట్లుగా ఉంది. అంటే, 83 శాతానికి పైగా నిధులు ఖర్చు పెట్ట‌కుండా ఆ రంగాన్ని నిర్ల‌క్ష్యం చేసింది. ఇక విద్యా రంగానికి రూ.9,351 కోట్లు కేటాయించగా కేవలం రూ.1,844 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా 80 శాతం నిధులను ఖ‌ర్చు పెట్ట‌కుండా వ‌దిలేసింది.

Also Read : KCR Kokapeta : కోకాపేట `భూ`ధ‌ర‌ల్లో రాజ‌కీయ గేమ్, బినామీ టెండ‌ర్ల‌తో హైప్?

2021-22 మధ్యకాలంలో ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయంలో 15 శాతానికి రూ.24,144 కోట్లకు అనుబంధ కేటాయింపు లభించిందని కాగ్ ఎత్తిచూపింది. పాఠశాల విద్య, క్రీడలు, మునిసిపల్, గిరిజన సంక్షేమం, బిసి సంక్షేమం మరియు ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్లలో 2021-22లో బడ్జెట్ కేటాయింపులకు వ్యతిరేకంగా గణనీయంగా త‌గ్గించార‌ని కాగ్ తేల్చింది. ఇలా కేసీఆర్ స‌ర్కార్ లోని డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డింది. వాస్త‌వాలు ఇలా ఉండ‌గా, కేసీఆర్ మాత్రం కోకాపేట భూముల ధ‌ర‌ల‌ను చూపుతూ తెలంగాణ ప్ర‌గ‌తి అంటున్నారు. ఎనిమిదేళ్లుగా రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌ల‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఆ రంగం మందగించిన‌ప్పుడ‌ల్లా ప్ర‌భుత్వ భూముల‌ను వేలం వేయ‌డం ద్వారా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కోకాపేట‌లోనూ అదే జ‌రిగింద‌ని  ( TS Reality)స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. విప‌క్షాలు కూడా కేసీఆర్ స‌ర్కార్ ద‌మ‌న‌నీతిని ఎండ‌గడుతోంది. దానికి బ‌లం చేకూరేలా కాగ్ తెలంగాణ ప్రభుత్వంలోని లోపాల‌ను ఎత్తిచూపింది.

Also Read : KCR Powder : BRS,BJP సూత్రం ఇంచుమించు ఒక‌టే..!