TS Polycet: టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 11:59 AM IST

 

TS Polycet : టీఎస్ పాలిసెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2024-25 విద్యాసంవ‌త్స‌రానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాల‌జీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం పాలిటెక్నిక్ ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఎస్ఎస్‌సీ(SSC) లేదా త‌త్స‌మాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా ప్ర‌స్తుతం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్(Polycet) రాత‌ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

We’re now on WhatsApp. Click to Join.

ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ నేటి నుంచి ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఏప్రిల్ 22. ఎస్సీ, ఎస్టీలు రూ. 250, ఇత‌రులు రూ. 500 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. రూ. 100 ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 24 లోపు, రూ. 300 ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 26వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. మే 17వ తేదీన పాలిసెట్ రాత‌ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ప‌రీక్ష నిర్వ‌హించిన 12 రోజుల‌కు ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం https://polycet.sbtet.telangana.gov.in/ అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

read also : Surekhavani : నాకు అలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి.. సురేఖా వాణి కామెంట్స్ వైరల్?