Site icon HashtagU Telugu

PrajaSangramaYatra: బీజేపీ మతతత్వ పార్టీ అయితే.. ఓవైసీ పార్టీ ఏంటీ..?

Sadhvi Imresizer

Sadhvi Imresizer

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ పెద్ద అంబర్ పేటలో జరిగింది. కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి. ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారి ఇళ్లపైకి యోగి బుల్డోజర్లు పంపుతున్నారని.. ఇక్కడ కూడా పంపాలా..? వద్దా.? అని ప్రజలను ప్రశ్నించారు. బీజేపీని మతతత్వ పార్టీ అని అంటున్నారని.. టీఆర్ఎస్ ఓవైసీ గురించి ఎందుకు మాట్లాడని ప్రశ్నించారు. భారత్ ను ముక్కలు చేయాలనుకుంటున్న వారు ఎవరని ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీలు ఒకటి అవుతున్నాయని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అపుతోందని ఆరోపణలు చేశారు.

కేసీఆర్ బెహామని, దోకాబాజీ అని విమర్శించారు. 190 కోట్ల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని.. రాష్ట్రప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదని ఆమె విమర్శించారు. పేదల మరుగుదొడ్లకు ఇచ్చిన డబ్బులను కూడా కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆమె విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామపంచాయతీలకు ఇవ్వడం లేదని..టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుతింటుందని ఆరోపించారు. పీఎఫ్ఐ ఉగ్రవాదిని పట్టుకుంటే ఓవైసీకి బాధకలుగుతోందని విమర్శించారు. అవినీతికి పాల్పడే వ్యక్తులు మనకు అవసరమా..? బీజేపీ అధికారంలోకి వస్తుంది.. దోపిడిదారులు బిస్తర్ సదురుకోవాల్సిందే అని ఆమె అన్నారు.-

 

Exit mobile version