Site icon HashtagU Telugu

TS Secretariat: సీఎం సారూ.. సచివాలయం పూర్తయ్యేదెన్నడూ!

KCR Kokapeta

Kcr

వాస్తవానికి అక్టోబర్ 5న జరగాల్సిన తెలంగాణ కొత్త సచివాలయ భవన ప్రారంభోత్సవం డిసెంబర్‌కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక వర్గాల ప్రకారం.. ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 20% దసరా నాటికి పూర్తవుతాయి. అయితే, ఇంటీరియర్ వర్క్స్, ఫినిషింగ్ టచ్‌లకు డిసెంబర్ వరకు మరో రెండు నెలల సమయం పడుతుంది. ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు అంతస్తుల సచివాలయ భవనాన్ని రూ.650 కోట్లతో నిర్మిస్తున్నారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆర్‌అండ్‌బి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రాజెక్టు పురోగతిని పరిశీలించేందుకు తరుచుగా విజిట్ చేస్తుండటంతో నిర్మాణ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. డిసెంబర్ 2021, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌అండ్‌బి మంత్రితో కలిసి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి, ఈ ఏడాది దసరా నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు దాదాపు 1500 మంది కార్మికులను నియమించారు. నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనంగా 1,000 మంది కార్మికులను నియమించాలని ఆర్ అండ్ బి మంత్రి కోరారు. అయితే డిసెంబర్ లోనైనా సచివాలయం అందుబాటులోకి వచ్చేనా అంటూ సామాన్య ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.