Malla Reddy Attacked: మంత్రి మల్లారెడ్డిపై కాన్వాయ్ పై రాళ్ల దాడి….ఆ వ్యాఖ్యలే కారణమా..?

మినిస్టర్ మల్లారెడ్డికి సొంత జిల్లాలోనే ఊహించని షాక్ తగిలింది.

Published By: HashtagU Telugu Desk
Mallareddy Attack

Mallareddy Attack

మినిస్టర్ మల్లారెడ్డికి సొంత జిల్లాలోనే ఊహించని షాక్ తగిలింది. ఘట్కేసర్ సింహగర్జన సభకు వెళ్లిన మంత్రి మల్లారెడ్డి…సభలో ప్రసంగిస్తుండగా…ఒక్కసారిగా ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు. అరుపులు, కేకలతో మల్లారెడ్డి గో బ్యాక్ అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. దీంతో ప్రసంగం మధ్యలోనే ఆపేసిన మల్లారెడ్డి వెనుదిరిగారు. మల్లారెడ్డి కాన్వాయ్ పై ప్రజలు బాటిళ్లు, కుర్చీలు విసురుతూ వీరంగం చేశారు. ప్రజల ఆగ్రహానన్ని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంత్రిని అక్కడి నుంచి తరలించారు. మంత్రి కాన్వాయ్ వెంట పరుగులు తీస్తూ కుర్చీలు,చెప్పులు, రాళ్లు విసరడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు తాళ్లతో వలయంగా ఏర్పడి మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ కు రక్షణగా నిలుస్తూ…మల్లారెడ్డిని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపారు.

మల్లారెడ్డిపై దాడికి కారణం ఇదే..!
మంత్రి సభలో మాట్లాడుతున్నంత సేపు…పదే పదే సీఎం కేసీఆర్, టీఆరెస్ సర్కార్ పేరు ఎత్తడంతోనే సభలో పాల్గొన్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మల్లారెడ్డి ఏం మాట్లాడారు..?
టీఆరెస్ సర్కార్ వచ్చాక గ్రామాల్లో అభివ్రుద్ధి జరిగింది. గ్రామాల్లో డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్ ,ట్రాక్టర్, ట్రాలీ ఇలా ఎన్నో సౌకర్యాలతో గ్రామాలను అందంగా తీర్చిదిద్దారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి డెవలప్ మెంట్ చూశామా…టీఆరెస్ సర్కార్ పించన్లు, కల్యాణలక్ష్మీ ఇస్తున్నారు. మీకు కూడా రెడ్ల కార్పొరేషన్ వస్తుంది…రెడ్ల కార్పొరేషన్ కూడా టీఆరెస్ ప్రభుత్వమే ఇస్తుందని…తప్పకుండా మేం చేయిస్తాం…ఇవి మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు.

  Last Updated: 29 May 2022, 11:54 PM IST