LAWCET 2024 : లాసెట్ దరఖాస్తు ప్రక్రియ షురూ.. మూడేళ్ల, ఐదేళ్ల కోర్సుల వివరాలివీ

LAWCET 2024 : తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాల కోసం టీఎస్ లాసెట్, పీజీఎల్ 2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న రిలీజైంది.

  • Written By:
  • Updated On - March 1, 2024 / 11:21 AM IST

LAWCET 2024 : తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాల కోసం టీఎస్ లాసెట్, పీజీఎల్ 2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న రిలీజైంది. లాసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్  ప్రక్రియ మార్చి 1న మొదలైంది. అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు అప్లికేషన్లు సమర్పించవచ్చు. లేట్ ఫీజుతో మే 25 వరకు అప్లై చేయొచ్చు. మే 30 నుంచి లాసెట్ (LAWCET 2024)  హాల్‌టికెట్లను జారీ చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join

లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షను జూన్ 6న ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం  12.00 గంటల వరకు లాసెట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ.600, ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులకు రూ.900 చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 25 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 5 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో మే 25 వరకు  అప్లికేషన్లు సబ్మిట్ చేయొచ్చు. దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సవరించుకునేందుకు మే 20 నుంచి 25 వరకు ఛాన్స్ కల్పిస్తారు. కాగా, లాసెట్ దరఖాస్తుకు రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. పీజీఎల్‌సెట్ దరఖాస్తు్కు రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది. లాసెట్ ప్రాథమిక కీ  జూన్ 6న విడుదల అవుతుంది.  ప్రాథమిక ఆన్సర్ కీ అభ్యంతరాల గడువు జూన్ 7 వరకు ఉంటుంది.  పరీక్ష కేంద్రాలు..  హైద్రాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, విజయవాడలలో ఉంటాయి.

Also Read : YS Jagan Vs Dastagiri : వైఎస్ జగన్‌పై దస్తగిరి పోటీ.. జైభీమ్ పార్టీ తరఫున బరిలోకి

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

మూడేళ్ల  ఎల్‌ఎల్‌బీ కోర్సు చేయాలని అనుకునేవారు 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేయొచ్చు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే చాలు. అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు.

ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు 

ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సు మూడు రకాలుగా ఉంటుంది. బీఏ ఎల్‌ఎల్‌బీ,  బీకామ్ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరొచ్చు. 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వాళ్లు అప్లై చేయొచ్చు. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.ఎలాంటి వయోపరిమితి లేదు.

రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు

రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులో చేరాలని భావించేవారు ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఎలాంటి వయోపరిమితి లేదు.

Also Read :Obesity: ప్రపంచంలో 100 కోట్లు దాటిన ఊబ‌కాయం బాధితులు..!