TS Inter Results 2023: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) మే 9వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాల (TS Inter Results 2023)ను విడుదల చేయనుంది. విడుదలైన తర్వాత పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లలో tsbie.cgg.gov.in, results.cgg.gov.in తనిఖీ చేయవచ్చు. మార్చి-ఏప్రిల్‌లో జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,82,501 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,23,901 మంది మంది విద్యార్థులు హాజరయ్యారు.
విద్యార్థులు తమ ఫలితాలను రోల్ నంబర్లు/హాల్ టికెట్ నంబర్లను ఉపయోగించి చూడవచ్చు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సంవత్సరం చివరి పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 3 వరకు, 2వ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. ఈ పరీక్షలు ఒకే షిప్టులలో జరిగాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
Also Read: WhatsApp: వాట్సప్‌కు ఈ నెంబర్ల ద్వారా కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయా? అయితే బీ అలర్ట్
TS ఇంటర్ ఫలితాలు 2023 తనిఖీ చేయడానికి వెబ్‌సైట్‌లు
tsbie.cgg.gov.in
results.cgg.gov.in
examresults.ts.nic.in
manabadi.co.in (అనధికారిక)
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023: ఎలా తనిఖీ చేయాలి..?
– అధికారిక వెబ్‌సైట్, tsbie.cgg.gov.inని సందర్శించండి.
– తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
– తర్వాత 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
– తగిన ఆధారాలను నమోదు చేసి సమర్పించండి.
– TS ఇంటర్మీడియట్ ఫలితం 2023 ప్రదర్శించబడుతుంది.
– TS ఇంటర్ ఫలితం 2023 pdf ప్రింటవుట్ తీసుకోండి.
2022లో దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 63.32 శాతం మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలకు అర్హత సాధించగా, 67.16 శాతం మంది ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు మొత్తం 4,64,892 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 54.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికల్లో 72.22 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,42,895 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 2,97,458 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 59.21 శాతం ఉత్తీర్ణత సాధించగా, 75.28 శాతం ఉత్తీర్ణత సాధించారు.