Site icon HashtagU Telugu

MLC Dande Vithal: బిగ్ షాక్‌.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు

MLC Dande Vithal

Safeimagekit Resized Img (8) 11zon

MLC Dande Vithal: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ (MLC Dande Vithal) ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్‌ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి ఈమేరకు తీర్పునిచ్చింది. దండె విఠల్‌ ఎమ్మెల్సీ ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలిచ్చారని రాజేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ వేశారు.

Also Read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మైలురాయి.. 50 కోట్ల మందిని గ‌మ్య‌స్థానాల‌కు చేర్చిన మెట్రో

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఈ మేరకు తీర్పును వెల్ల‌డించింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో దండె విఠల్ ఎన్నికైన విష‌యం తెలిసిందే. ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలను స‌మ‌ర్పించార‌ని రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు తాజాగా నేడు దండె విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసింది. అంతేకాకుండా దండె విఠల్ కు 50వేల జరిమానాను హైకోర్టు విధించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలని హైకోర్టును దండె విఠల్ కోరారు. దండె విఠల్ న్యాయవాది అభ్యర్థనతో తీర్పును 4 వారాల పాటు హైకోర్టు సస్పెండ్ చేసింది.

We’re now on WhatsApp : Click to Join