TS High Court: రోజుకు లక్ష టెస్ట్‌లు చేయాలి!

తెలంగాణలో ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. రోజుకు కనీసం లక్ష టెస్ట్‌లు చేయాలని స్పష్టం చేసింది. వీటిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

  • Written By:
  • Updated On - January 17, 2022 / 01:04 PM IST

తెలంగాణలో ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. రోజుకు కనీసం లక్ష టెస్ట్‌లు చేయాలని స్పష్టం చేసింది. వీటిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి, ఆంక్షలపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రంలో రోజుకు ఎన్ని టెస్ట్‌లు చేస్తున్నారని ప్రభుత్వం తరపున న్యాయవాదుల్ని ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని, రోజుకు లక్ష వరకు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లే చేయాలని స్పష్టం చేసింది. వాటితోపాటు ర్యాపిడ్‌ పరీక్షల వివరాల్ని విడివిడిగా తమకు సమర్పించాలని ఆదేశించింది.

సోషల్‌ డిస్టెన్స్‌, ఇతర ఆంక్షల అమలు తీరు ఎలా ఉందో వివరాలు అడిగి తెలుసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 60 వేల లోపు మాత్రమే టెస్ట్‌లు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌తో కలిపి చేస్తున్న ఈ 60 వేల టెస్ట్‌ల్లోనే రోజుకు రెండున్న వేల కేసులు వస్తున్నాయి. డిసెంబర్‌ 31 నుంచి వరుసగా రోజుకు 500 కేసుల చొప్పున పెరుగుతూ వచ్చిన కేసుల సంఖ్య ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. ఏపీలో మాత్రం ఐదు వేల కేసులు వస్తున్నాయి. తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గడంపై ఒక వైపు చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే హైకోర్టులో విచారణ కీలకంగా మారింది. టెస్ట్‌ల సంఖ్యపై తమకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంక్రాంతి సీజన్‌ ముగిసి నగరవాసులంతా మళ్లీ తిరిగి వస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య కచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కరోనా తీవ్రత దృష్ట్యా హైకోర్టు మళ్లీ ఆన్‌లైన్‌ విచారణలు చేపట్టబోతోంది.