Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 12:57 PM IST

 

Telangana HC Verdict On MLCs : తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలు(governor quota mlc)గా కోదండరాం, ఆమీర్‌ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని హైకోర్టు ఆదేశించింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని కొట్టి వేసే అధికారం గవర్నర్‌కు లేదని హైకోర్టు పేర్కొంది. కేబినెట్‌కు తిప్పి పంపాలి తప్ప తిరస్కరించొద్దని.. ఈ క్రమంలోనే కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాన్ని కొట్టివేసింది.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేబినెట్ నామినేట్ చేసింది. ఈ ఇద్దరి పేర్లను ఆమోదించాలని గవర్నర్‌ తమిళి సైకు పంపారు. గవర్నర్ మత్రం ఈ ఇద్దరి పేర్లను తిరస్కరించారు.. ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసేందుకు అర్హతలు లేవన్నారు. దీంతో నియామక ప్రక్రియ అక్కడే నిలిచిపోగా.. ఇంతలో గతేడాది ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ ఓడింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే తమ పేర్లను గవర్నర్ ఎమ్మెల్సీలుగా ఆమోదించకపోవడాన్ని దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో సవాల్ చేశారు.

read also : Chandrababu : సీనియారిటీ కంటే సర్వేలనే చంద్రబాబు నమ్ముతున్నారా..?

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని పిటిషన్‌లో కోర్టుకు వివరించారు. కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్‌కు లేదన్నారు.. హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఇంతలో ప్రొఫెసర్ కోదండరామ్, ఆమీర్‌ అలీఖాన్‌ పేర్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాకు ప్రతిపాదించింది. ఈ సిఫార్సుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు.. హైకోర్టులో తమ పిటిషన్ పెండింగ్ లో ఉండగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఆమోదించడంపై దాసోజు శ్రవణ్ , సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. తాజాగా తీర్పును వెల్లడించింది.. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.