TS Secretariat : తెలంగాణ కొత్త స‌చివాల‌యానికి `అంబేద్క‌ర్` పేరు

తెలంగాణ స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. అంబేద్క‌ర్ దార్శినిక‌త‌తోనే తెలంగాణ వ‌చ్చింద‌ని భావిస్తోన్న ఆయ‌న కొత్త స‌చివాల‌య నామ‌క‌ర‌ణం నిర్థారించారు. ఆ మేర‌కు చీఫ్ సెక్ర‌ట‌రీకి ఆదేశించారు.ఇ

  • Written By:
  • Updated On - September 15, 2022 / 04:27 PM IST

తెలంగాణ స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. అంబేద్క‌ర్ దార్శినిక‌త‌తోనే తెలంగాణ వ‌చ్చింద‌ని భావిస్తోన్న ఆయ‌న కొత్త స‌చివాల‌య నామ‌క‌ర‌ణం నిర్థారించారు. ఆ మేర‌కు చీఫ్ సెక్ర‌ట‌రీకి ఆదేశించారు.ఇటీవ‌ల కొత్త పార్ల‌మెంట్ కు అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతేకాదు, తెలంగాణ అసెంబ్లీ కూడా ఆమేర‌కు తీర్మానం చేసింది. ఇదే త‌రుణంలో కొత్త స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరును ఖ‌రారు చేయ‌డం గ‌మనార్హం.

 

 

దేశంలోనే ఎత్తైనా అంబేద్క‌ర్ విగ్ర‌హం నిర్మాణం జ‌రుగుతోంది. ఎన్టీఆర్ ఘాట్ స‌మీపంలోనే అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డంతో పాటు ప్ర‌త్యేక సంద‌ర్శ‌న ప్లేస్ గా డిజైన్ చేశారు. రాబోవు ఎన్నిక‌ల నాటికి సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను చూసుకుంటోన్న కేసీఆర్ ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని ఆశించ‌డం స‌ర్వ‌సాధార‌ణం.