Site icon HashtagU Telugu

Basar IIIT: బాసర ట్రిపుల్ ఐటీ AOను తొలగించిన సర్కార్.!!

Basara

Basara

ఆందోళన బాటపట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బాసర ట్రిపుల ఐటీ ఏవోపై వేటు వేసింది సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అటు విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చల్లో గందరగోళం నెలకొంది. చర్యలు సఫలమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొంటే…చర్చలు విఫలమంటూ విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం లిఖితపూర్వకహామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. ఆదివారం కూడా ఆందోళనలు కొనసాగిస్తామంటూ వెల్లడించారు. బాసర ట్రిపుల్ ఐటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాల్సిందేనని పట్టుబడుతున్నారు స్టూడెంట్స్ .

కాగా విద్యార్థుల నిరసనల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సింది…ఆందోళన విరమణ కోసం వారిని కొందరు HODలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. దీన్ని తాను తీవ్రం ఖండిస్తున్నట్లు చెప్పారు. ఆందోళన విరమించకుంటే భోజనం పెట్టమంటూ హెచ్చరించిన హెచ్ఓడీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version