Site icon HashtagU Telugu

TS GOVT : ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తుల వెల్లడిపై వెనక్కి తగ్గిన సర్కార్..!!

Government Of Telangana Logo

Government Of Telangana Logo

టీచర్ల ఆస్తుల వెల్లడిపై వెనకడుగు వేసింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక నుంచి ప్రతిఏటా క్రమం తప్పకుండా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ అంశంపై అధికారికంగా జారీ చేసిన ఉత్తర్వులను గంటల వ్యవధిలోనే ఉపసంహరించుకుంది సర్కార్. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం రాత్రి సదరు ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రతిఏటా తమ ఆస్తులను ప్రభుత్వ ఉపాధ్యాయులు వెల్లడించాలని ఆదేశిస్తూ…శనివారం మధ్యాహ్నం విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసందే. అంతేకాదు స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలను కూడా ముందుగా అనుమతితీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులపై రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నుంచి పెద్దెత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఉపాధ్యాయులతో పాటు విపక్షాలు కూడా సర్కార్ నిర్ణయంపై విరుచుకుపడ్డాయి. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తుల చిట్టా వెల్లడించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితిని క్షుణ్ణంగా అంచనా వేసిన ప్రభుత్వం ఉత్తర్వులను నిలిపివేసినట్లు కీలక నిర్ణయం తీసుకుంది.