Site icon HashtagU Telugu

Telangana: ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 10 వేల పడకలు: హరీశ్ రావు

Telangana

New Web Story Copy 2023 08 06t140347.400

Telangana: తెలంగాణా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 10,000 హాస్పిటల్ బెడ్‌ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అలాగే భవిష్యత్తులో 50,000 వరకు పొడిగించనున్నట్లు హరీష్ శాసనమండలిలో తెలిపారు. ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ మరియు చుట్టుపక్కల నాలుగు 1000 పడకల టిమ్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రతి టిమ్స్‌లో 2,000 మంది పారామెడికల్ సిబ్బంది, 500 మంది రెసిడెంట్ డాక్టర్లు, 20 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసియు పడకలు, క్యాన్సర్ చికిత్స, సిటి స్కాన్‌లు మరియు ఎంఆర్‌ఐ మరియు ఇతర ముఖ్యమైన సౌకర్యాలు ఉంటాయాని తెలిపారు.

గతంలో కాన్పుల కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే అనేక రకాలుగా దోపిడీకి గురయ్యేవారు. అవసరం లేకుండా ఆపరేషన్లు చేసి పేద ప్రజల ఒళ్ళు, ఇల్లు గుల్ల చేసేవారని చెప్పారు హరీష్ రావు. ప్రస్తుతం రాష్ట్రంలో గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సుఖ ప్రసవం చేయడంతో పాటు, కేసీఆర్ కిట్ అందిస్తూ, అన్ని రకాల వైద్య సేవలను అందించి, ప్రభుత్వ వాహనంలో ఉచితంగా ఇంటికి పంపిస్తున్నమని స్పష్టం చేశారు.

2014 ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30 శాతం మాత్రమే కాగా, నేడు 70 శాతంకు పెరిగాయని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వాసుపత్రులు ఎంతగా మెరుగుపడ్డాయో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనలో ప్రజావైద్యంలో తెలంగాణ సాధించిన విప్లవానికి ఇదో మచ్చు తునక. ఒకే రోజు 44 మందికి పురుడు పోసి, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిష్ట నిలిపిన మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ వైద్యసిబ్బందికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.

Also Read: Forced To Drink Urine : ఇద్దరు పిల్లలతో మూత్రం తాగించి.. ఆ పార్ట్స్ లో మిరపకాయలు రుద్దారు!