2024 ఫిబ్రవరిలో నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర (Medaram Maha Jatara)కు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వూలు జారీ చేసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పేరుంది. ఈ జాతర కు అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని..వారి మొక్కులు తీర్చుకుంటారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి లో జరగబోయే ఈ జాతరకు సంబదించిన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మహా జాతరలో తాగునీరు, పారిశుధ్య పనులకు అత్యధికంగా రూ.14 కోట్ల 74లక్షల 90వేలను ప్రభుత్వం కేటాయించింది.
అలాగే భక్తుల భద్రత కోసం పోలీస్ శాఖకు రూ.10కోట్ల 50లక్షలు
రహదారుల మరమ్మతులు, నిర్మాణం కోసం రూ.2 కోట్ల 80లక్షలు
దేవాదాయ శాఖకు రూ.కోటీ50లక్షలు
పంచాయతీరాజ్ శాఖకు రూ.4కోట్ల 35లక్షలు
మైనర్ ఇరిగేషన్‌కు రూ.6కోట్ల 11లక్షల 70వేలు
వైద్య ఆరోగ్య శాఖకు రూ.కోటి
ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ శాఖకు రూ.8 కోట్ల 28లక్షల 85వేలు
విద్యుత్ శాఖకు రూ.3కోట్ల 96లక్షల 92వేలు
టీఎస్ ఆర్టీసీకి రూ.2కోట్ల 25లక్షలు
ఎక్సైజ్ శాఖకు రూ.20లక్షలు
సమాచార పౌర సంబంధాల శాఖకు రూ.50లక్షలు
పశు సంవర్థక శాఖకు రూ.30లక్షలు
టూరిజం శాఖకు రూ.50లక్షలు
రెవెన్యూ శాఖకు రూ.5కోట్ల 25లక్షలు
జిల్లా పంచాయతీ అధికారికి శానిటేషన్ కోసం రూ.7కోట్ల 84లక్షల 97వేలు
మత్స్యశాఖకు రూ.24లక్షల 66వేలు
అగ్నిమాపక శాఖకు రూ.20లక్షలు
అటవీ శాఖకు రూ.20లక్షలు
ఐసీడీఎస్ విభాగానికి రూ.23లక్షలు
ట్రైబల్ డెవలప్‌మెంట్ విభాగంలో ఐటీడీఏ పీవోకు రూ.4కోట్లను విడుదల చేసినట్లు జీవోలో పేర్కొన్నారు.
Read Also : TS Assembly : మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై న్యాయ విచారణ జరిపించాలి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి