Site icon HashtagU Telugu

TS Mandals: తెలంగాణలో కొత్త మండలాలు.. జాబితా ఇదే!

Telangana

Telangana

మొదట 10 జిల్లాలుగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర విభజన ఫలితంగా 33 జిల్లాలకు విస్తరించింది. ఈ సందర్భంగా అనేక కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా ఏర్పాటయ్యాయి. పరిపాలనా సౌలభ్యం మరియు ప్రజల డిమాండ్ కోసం అదనంగా 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు చేస్తున్న మార్పుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మండలాలు ఏర్పాటయ్యే జిల్లాలకు ప్రభుత్వం పేరు పెట్టింది.

కొత్త మండలాలు

నారాయణపేట జిల్లా.. గుండుమల్, కొత్తపల్లె మండలాలు (నారాయణపేట రెవెన్యూ డివిజన్ పరిధి)
వికారాబాద్ జిల్లా.. దుడ్యాల్ మండలం ( తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధి)
మహబూబ్ నగర్ జిల్లా.. కౌకుంట్ల మండలం (మహబూబ్ నగర్ రెవిన్యూ డివిజన్ పరిధి)
నిజామాబాద్ జిల్లా..ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు (ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధి)
నిజామాబాద్ జిల్లా.. సాలూర మండలం (బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధి)
మహబూబాబాద్ జిల్లా.. సీరోల్ మండలం (మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధి)
నల్గొండ జిల్లా.. గట్టుప్పల్ మండలం (నల్గొండ రెవిన్యూ డివిజన్ పరిధి)
సంగారెడ్డి జిల్లా.. నిజాంపేట్‌ మండలం (నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధి)
కామారెడ్డి జిల్లా.. డోంగ్లీ మండలం (బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధి)
జగిత్యాల జిల్లా.. ఎండపల్లి మండలం (జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిధి)
జగిత్యాల జిల్లా.. భీమారం మండలం (కోరుట్ల రెవెన్యూ డివిజన్ పరిధి)

Exit mobile version